AP: మాజీమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదైంది. కడప జిల్లా పులివెందులలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అర్జున్ రెడ్డి, వర్రా రవీందర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.