AP: రాజమండ్రి ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి అందాల నడుమ రుచుల విందు ఆస్వాదించేలా ఫ్లోటింగ్ రెస్టారెంట్ సిద్ధమవుతోంది. పర్యాటకశాఖ సౌజన్యంతో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో గోదావరిపై తొలిసారిగా పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి రానుంది. ఈనెల 27న ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దీనిని ప్రారంభిస్తారని, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.