AP: సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ అంశంపై ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. దీనికి అనుగుణంగా గుంటూరు, విజయవాడ, అమరావతిలో పలు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలో ‘చెడు విషయాలు పోస్ట్ చెయొద్దు..నైతికంగా పతనం కావొద్దు’ అని ప్రతిజ్ఞ చేద్దామంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని ఇంగ్లీష్, తెలుగులో ప్రచురించారు.