రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న పూణెలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాహుల్‌కు పరిపక్వత లేదని, విదేశాల్లో భారత్‌ను నిందించడం వలన ఎవరూ నాయకులు కాలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ అతన్ని చాలా సార్లు లాంచ్ చేసింది. కానీ ఇప్పటి వరకు తనకు రాజకీయ పరిపక్వత రాలేదన్నారు. అతని నాయకత్వంలో కాంగ్రెస్ ఎదిగే అవకాశం లేదని ఎద్దేవా చేశారు.