ఎయిర్ కండీషనర్లపై జీఎస్టీ రేటు 18 శాతానికి తగ్గనుంది. దీంతో కొనుగోలుదార్లకు 10 శాతం ప్రయోజనం కలగనుంది. ఒక్కో ఏసీపై రూ. 4,000 ధర తగ్గనుంది. ఇప్పటికే తగ్గింపు ధరలతో కంపెనీలు MRP లేబుల్స్ సిద్ధం చేశాయి. సెప్టెంబర్ 22 నుంచి భారీగా ఆర్డర్లు ఉంటాయనే భావనతో ఏసీల బిగింపు కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నాయి.