GNTR: 5 లక్షల మొక్కలు నాటడం ద్వారా నగరాన్ని గ్రీన్ గుంటూరుగా తయారు చేయవచ్చని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం మేయర్ కోవెలమూడి, కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం నిర్వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు.