క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో ఓ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన హైదరాబాద్, వనస్థలిపురంలో చోటుచేసుకుంది. నాకు చదువులో కంటే క్రికెట్‌పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. చదువు రాదని కాదు, క్రికెట్ అంటే చాలా ఇష్టం.. మీకు నీనంటే ఎంత ఇష్టమో క్రికెట్ అంటే నాకు అంత ఇష్టం. నీను మంచిగా చదివి మంచి ఉద్యోగం చేయాలని, కష్టపడొద్దని మీ కోరిక. కానీ క్రికెటర్ అవ్వడం నా డ్రీమ్. గొప్ప క్రికెటర్ అయ్యాకే ఇంటికి వస్తా అని లేఖ రాసి వెళ్లాడు.