AP: రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ, యువకులతోపాటు ఓటరు జాబితాలో పేరు లేనివారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. నిన్నటి నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. డిసెంబర్ 28వ తేదీ వరకు నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఓటర్ల జాబితాతోపాటు సవరణలకు దరఖాస్తులను స్వీకరించడానికి BLOలు అందుబాటులో ఉంటారన్నారు.