దేశవ్యాప్తంగా పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 100 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలకు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ వచ్చినట్లు ఏవీయేషన్ అధికారులు వెల్లడించారు. 16 రోజుల వ్యవధిలో ఏకంగా 510 జాతీయ, అంతర్జాతీయ విమానాలకు సోషల్ మీడియా వేదికగా ఏవీయేషన్ సెక్యూరిటీకి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.