లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాసీం నియమితులయ్యారు. ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ దళాలు గత నెలలో హతమార్చిన విషయం తెలిసిందే. నస్రల్లాకు చాలాకాలంగా డిప్యూటీగా వ్యవహరిస్తున్న 71 ఏళ్ల ఖాసీం ఆయన మృతి తర్వాత తాత్కాలిక నేతగా వ్యవహరిస్తున్నారు. కాగా, నస్రల్లా విధానాలను అనుసరిస్తూ, విజయం సాధించే వరకు శ్రమిస్తానని ఖాసీం ప్రతిజ్ఞ చేశారు.