దేశంలో ఉల్లి ధర మరింత పెరిగింది. నిన్న మొన్నటి వరకు హోల్సేల్ మార్కెట్లలో రూ.40-60 పలికిన కిలో ఉల్లి.. ఇప్పుడు ఏకంగా రూ.70 నుంచి 80కి చేరింది. దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉల్లి ధర కిలో రూ.80 ఉంది. ఇతర నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఉల్లితోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా పెరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.