TG: రాష్ట్రవ్యాప్తంగా ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించేందుకు ఈనెల 21 నుంచి పోలీసు సంస్మరణ దినోత్సవాలు జరుపనున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు 10 రోజులపాటు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 214 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని.. అందులో తెలంగాణకు చెందిన ఒక పోలీసు అధికారి ఉన్నారని పేర్కొన్నారు.