TG: హైదరాబాద్లోని పంజాగుట్ట లలితా జ్యువెలరీ స్టోర్లో ఘరానా మోసం బయటపడింది. బంగారపు కాయిన్ స్థానంలో వెండి బిళ్లకు బంగారు పూత పూసి అగంతకుడు మోసం చేశాడు. అయితే ఈ విషయం స్టోర్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. ఈ క్రమంలోనే లలితా జ్యువెలరీ స్టోర్ వారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.