CTR: మూడో శనివారం పారిశుద్ధ్యం పరిశుభ్రతను పెంపొందించేందుకు స్వర్ణాంధ్ర – స్వచ్చంధ్ర కార్యక్రమంలో అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సమిత్ కుమార్ తెలిపారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం ప్రధాన అంశంగా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.