ASR: చింతపల్లి మండలంలో లోతుగెడ్డ గ్రామంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో శుక్రవారం జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. రాములు వారి విగ్రహ ప్రతిష్ట ఈ ప్రాంతవాసులకు ఎంతో శుభ పరిణామమని అన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.