డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని అమెరికా న్యాయ విభాగం పేర్కొన్న విషయం తెలిసిందే. దాన్ని ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారని తెలిపింది. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇవి ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరం చేసేవిగా పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాకీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మరోవైపు ట్రంప్ హత్య కుట్రలో ఇరాన్ ప్రమేయాన్ని విదేశాంగ ప్రతినిధి ఎస్మాయిల్ సైతం ఖండించారు.