ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. శీతాకాలం నేపథ్యంలో ఇప్పటికే కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు మూసివేశారు. నవంబర్ 17న బద్రీనాథ్ ఆలయం మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో ఇప్పటివరకు 246 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. గత ఏడాది 242 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.