బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా 2009లో అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశ భద్రతా దళాలు అసమ్మతి వాదులను ప్రత్యేక జైళ్లకు తరలించినట్లు పత్రికా కథనాలు వెలువడ్డాయి. అందులో కొందరు చనిపోగా, మరికొందరిని ‘హౌస్ ఆఫ్ మిర్రర్’గా పిలిచే చీకటి జైళ్లలో బంధించి ఉంచారని కథనాలు పేర్కొన్నాయి. ఇలా దాదాపు 700 మంది కనిపించకుండా పోయారని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చని అంచనా.