NRML: గ్రూప్-3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. వచ్చే సోమ, మంగళ వారాల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.