TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. న్యాయవాదితో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు.. హర్షసాయి టార్చర్ చేస్తున్నాడని, మెయిల్స్ పెట్టి వేధిస్తున్నడని ఫిర్యాదులో పేర్కొంది. మెగా సినిమా పేటెంట్ రైట్స్‌పై ఇద్దరి మధ్య వివాదం వచ్చిందని, మూవీ స్క్రిప్ట్ మాట్లాడుకుందామని పిలిచి.. డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది.