AP: ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలని మంత్రి లోకేశ్ సూచించారు. మాజీ సీఎం జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో అందరూ చూశారని అన్నారు. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందన్నారు. రెడ్‌బుక్ పని ప్రారంభమైందని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు.