ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ US జాతీయ భద్రత సలహాదారు సలీవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలకు భారత్ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్, మోదీల భేటీలో ఉక్రెయిన్- రష్యా యుద్ధం, మోదీ ఉక్రెయిన్ పర్యటన వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధం చేపట్టి.. అంతర్జాతీయ చట్టాలను రష్యా ఉల్లంఘించిందని అమెరికా ఇప్పటికే వెల్లడించినట్లు చెప్పారు.