AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూములను పవన్ స్వయంగా పరిశీలించనున్నారు. మాచవరం మండలంలో సరస్వతి పవర్‌కు కేటాయించిన 1515.93 ఎకరాల్లో అటవీ భూములు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ భూములపై పవన్ ఫోకస్ పెట్టారు.