AP: వైసీపీ అప్పులు చేస్తే.. తాము పెట్టుబడులు తెస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రావటంతో ఐటీ సంస్థలు తిరిగి ఏపీకి వస్తున్నట్లు తెలిపారు. మంత్రి లోకేశ్ కృషితో విశాఖకు టీసీఎస్ రానుందని చెప్పారు. పెట్టుబడులపై వైసీపీ అధినేత జగన్ ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. వచ్చిన కంపెనీలకు కూడా తరిమేశారని ఆరోపించారు. 4 నెలల్లో రూ.60 వేల కోట్లకుపైగా పెట్టుబడులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.