AP: విద్యుత్ ఛార్జీల గురించి మాజీ సీఎం జగన్ మాట్లాడటం విడ్డూరమని మంత్రి పార్థసారథి వెల్లడించారు. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. ట్రూఅప్ ఛార్జీలపై ఈఆర్సీ ప్రతిపాదన జగన్ ప్రభుత్వం చేసిన పాపమేనని మండిపడ్డారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే రూ. 6072 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం పడిందన్నారు.