జార్ఖండ్ CM హేమంత్ సోరెన్ అత్యంత అవినీతిపరుడని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ఆయనను గద్దె దించాల్సిన సమయం వచ్చిందని, ప్రజలంతా BJPకి ఓటు వేయాలని కోరారు. గత BJP CMలు ఎప్పుడూ అవినీతి ఆరోపణలను ఎదుర్కొలేదని తెలిపారు. హేమంత్ చర్యలనూ భారత్ ఎప్పటికీ క్షమించబోదని వెల్లడించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాలను ఆయన ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే BJP అధికారంలోకి రావాలన్నారు.