AP: రాష్ట్రంలో 23 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న, ఒకే చోట దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రణాళిక విభాగంలోని పలువురు అధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు.