AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై DY. CM పవన్ స్పందించారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతిఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. అలాగే, ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించారు. రేపు ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపట్టి, 11 రోజులపాటు కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పవన్ వెల్లడించారు.