AP: పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని, ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపడతానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ తయారవుతోందన్నారు. తక్కువ సమయంలోనే పిఠాపురం సంపూర్ణాభివృద్ధి చేస్తానన్నారు. రోడ్లపై చెత్త కనిపించకూడదు, పిల్లలకు మైదానాలు బాగుండాలి, తాగేందుకు శుభ్రమైన నీరు ఉండాలన్నారు.