AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు, అధికారుల చూపు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న వారాహి డిక్లరేషన్పైనే ఉంది. కాగా, ఇటీవల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి రావడంతో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.