AP: రాష్ట్రంలో నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత(టెట్ 2024) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 4.27 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈనెల 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంలు, మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. కాగా, హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై సహా పలు ప్రాంతాల్లో 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.