AP: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు విజయవాడలోని బుడమేరు వాగు పొంగడంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే, వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద వరద బాధితులకు నందమూరి మోహనకృష్ణ, నందమూరి రూప సీఎం చంద్రబాబును కలిసి రూ.25 లక్షల విరాళం అందజేశారు. దీంతో వారికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.