గత కొద్ది రోజుల నుంచి తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్జే స్పందించారు. ప్రసాదం కల్తీ కావటం దుర్మార్గమని, ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని అన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి.. ఇటువంటి చర్యలు సరికాదని వ్యాఖ్యానించారు.