TG: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు సీబీఐ విచారణ కోరితే కేంద్రం పరిశీలిస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ పూర్తిగా అపవిత్రమైందన్నారు. పలువురు హిందూ వ్యతిరేకులు అరాచకాలకు పాల్పడ్డారన్నారు. కొండపై అన్య మతస్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్య అని విమర్శించారు. ఇది ప్రసాదం అంశంగా ఎవరూ చూడొద్దని అన్నారు.