AP: టీటీడీ ప్రక్షాళనకు సీఎం చంద్రబాబు సిద్ధమైనట్లు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనన్నారు. 2019 వరకు శ్రీవారి ప్రసాదం జోలికి ఏ పాలకులు వెళ్లలేదని చెప్పారు. లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని గత కొంతకాలంగా భక్తులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇకపై స్వచ్ఛమైన నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.