AP: తిరుపతిలో ఎన్టీయే కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నేత జగన్ తిరుపతి పర్యటనని అడ్డుకోవద్దని నేతలు నిర్ణయించారు. జగన్ వెళ్లేదారిలో శాంతియుత నిరసన చేపట్టాలని భావిస్తున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీకి జగనే కారణమని నిరసన తెలిపేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. వైసీపీ రాజకీయ బలప్రదర్శనకు దిగితే.. అందుకు ధీటుగా సమాధానం చెప్పాలని కూటమి నేతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.