TG: గ్రీన్ ఫార్మాసిటీ యథావిథిగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి వద్ద గ్రీన్ ఫార్మాసిటీ ఉంటుందని చెప్పింది. గ్రీన్ ఫార్మాసిటీ రద్దు అనే మీడియా కథనాలు వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన రెవెన్యూశాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్.. ఫార్మాసిటీ రద్దుపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపారు.