TG: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే నిమ్స్ హాస్పిటల్లో ఉన్న విద్యార్థినులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.