గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 73కి పెరిగింది. మరోవైపు ఉత్తర గాజాలోని ఆస్పత్రుల్లో వైద్య సామగ్రి, మానవ వనరుల కొరత అధికంగా ఉందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ మిలిటెంట్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందిన విషయం తెలిసిందే.