మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఐదుగురు భార్యలు ఉన్నారు. ఇంజినీర్ మొదటి భార్య ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. తన భర్త పని సాకుతో చాలా రోజులుగా బయటే ఉంటున్నాడని, పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపింది. ఈ విషయం భర్త కుటుంబానికి కూడా తెలుసని, ఏడాదికో పెళ్లి చొప్పున ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.