జార్ఖండ్ గాఢ్వాలోని బంశీధర్ నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ప్రసంగం అనంతరం కేంద్రమంత్రి తిరిగి బయలు దేరుతుండగా.. ఆయన వచ్చిన హెలికాప్టర్లో ఇంధనం తక్కువగా ఉండటాన్ని పైలట్ గమనించారు. దీంతో హెలికాప్టర్లో నింపాల్సిన ఇంధనం కోసం గంటసేపు ఎదురు చూసినా ఇంధనంతో బయలుదేరిన వాహనం రాలేదు. దీంతో రోడ్డు మార్గంలో UPలోని వారణాసికి కేంద్రమంత్రి వెళ్లారు.