TG: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఉచిత బస్సు పథకంతో తాము దారుణంగా నష్టపోయామంటూ ఆటో డ్రైవర్లు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతు తెలిపేందుకు మాజీమంత్రి కేటీఆర్ అక్కడికి స్వయంగా ఆటోలో చేరుకున్నారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామన్నారని, ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలని కోరారు.