TG: హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, మాదాపూర్, సికింద్రాబాద్, రామాంతాపూర్, కూకట్ పల్లి, మూసాపేట్, బేగంపేట్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో పిడుగులు పడుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.