అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజరోజుకు పెరిగిపోతుంది. దీంతో తుపాకీతో జరుపుతున్న హింసను నివారించడానికి అధ్యక్షుడు బైడెన్ కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ మేరకు తాజాగా సంతకం కూడా చేశారు. దీంతో పాటు ఎన్నికల కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు స్టాప్గ్యాప్ బిల్లుపై కూడా సైన్ చేశారు. ఈ బిల్లు ఆధారంగా డిసెంబర్ 20 వరకు ప్రభుత్వానికి నిధులు అందుతాయని ది గార్డియన్ పేర్కొంది.