టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కి శుక్రవారం ఉాదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… సినీ నటి ఊర్వశి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరించింది.
అయితే ఆమె పంత్ గురించి ఎలాంటి ప్రస్తావన తీయకుండా.. సింపుల్‌గా ప్రార్థిస్తున్నాను అంటూ పోస్టును షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఊర్వశి పోస్టు కింద కూడా పంత్ కోలుకోవాలని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.
మామూలుగానే పంత్ పేరు వినగానే ఊర్వశి రౌతలా పేరు వినపడుతుంది. 2018లో ఓ సారి ఆర్పీ(పంత్ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా).. తన కోసం గంటల తరబడి ఎదురుచూశాడని, కానీ తాను మాత్రం అతడిని కలిసేందుకు నిరాకరించినట్లు ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆమె వ్యాఖ్యలపై పంత్ కూడా స్పందించాడు. పాపులారిటీ కోసం జనం ఇలా ఇంటర్వ్యూల్లో అబద్ధాలాడటం ఫన్నీగా ఉందంటూ ఉరశ్వికి పంత్ కౌంటర్ వేశాడు. పేరు, గుర్తింపు కోసం కొంతమంది ఇలా వార్తల్లో హెడ్ లైన్లలో నిలుస్తారని, వారికి దేవుడి ఆశీర్వాదం ఉండాలని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టాడు. అంతటితో ఆగకుండా అక్క నన్ను వదిలేయ్ అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు.