ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబయి(Mumbai)లో నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ కాస్త ఆలస్యంగా మొదలైన సంగతి తెలిసిందే. అయితే, ముంబయిలో ప్రవేశించిన కొన్నిరోజులకే రుతుపవనాల (Monsoons) ప్రభావం మొదలైంది. భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు వరద ముంపు(flood inundation)కు గురయ్యాయి.
గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు అంధేరీ సబ్ వే (Andheri Subway)నీట మునిగింది. గోరేగావ్, విలేపార్లే, లోయర్ పారెల్ ప్రాంతాల్లోనూ వర్షబీభత్సం కనిపించింది. థానే(Thane)లో రహదారులు జలమయం అయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ (traffic) నిలిచిపోయింది. బోరివెలి వెస్ట్, ఎస్వీ రోడ్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. ముంబయిలో ఈ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గరిష్ఠంగా 98 మిమీ వర్షపాతం నమోదైంది. థానేలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 105 మిమీ వర్షపాతం నమోదైంది.
అటు, భారత వాతావరణ సంస్థ (IMD) ముంబయి, థానే ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముంబై నగరాలను రుతుపవనాలు ఏకకాలంలో తాకడం అరుదుగా జరుగుతుంది. ఆరు దశాబ్దాల క్రితం ఇలా జరిగిందని గుర్తు చేసిన అధికారులు.. చివరి సారిగా 1961 జూన్ 21న ఢిల్లీ, ముంబయి నగరాల్లోకి ఒకే రోజున రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ముంబయి సహా మహారాష్ట్ర (Maharashtra) మొత్తం విస్తరించాయి