బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఒకే ఒక్క కోరిక ఉందని, తాను ఒకటే విషయాన్ని చెబుతున్నానని, వ్యక్తిగతంగా తనకు ఏమీ అవసరం లేదని, తనకు ఒకటే కల ఉందని, ప్రతిపక్ష నేతలందరూ ఒక్కటై ముందుకు సాగాలని, ఇది దేశానికి లాభదాయకంగా మారుతుందని నితీశ్ కుమార్ తెలిపారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ సభను ఉద్దేశించి ప్రశ్న వేయగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ సభకు వచ్చిన నేతలందరూ ప్రధాని మోదీ విధానాలను తప్పుపట్టారు. 2024 ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్తారని, తాము ఢిల్లీకి వెళ్తామని కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. మోదీ విధానంప్రైవేటీకరణ అని, కానీ తమది జాతీయికరణ విధానమని కేసీఆర్ తెలిపారు.