New Parliament Building Is 140 Crore People Aspiration
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం (New Parliament Building).. కేవలం బిల్డింగ్ కాదని ప్రధాని మోడీ ( PM Modi) అన్నారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం అని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంలో అమృత మహోత్సవ్‌ను దేశం జరుపుకుంటుందని తెలిపారు.
పాత పార్లమెంట్ భవనంలో ఇబ్బందులు ఉన్నాయని మోడీ (Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూర్చోవడానికే కాదు, సాంకేతికంగా సమస్యలు వచ్చేవన్నారు. భవిష్యత్‌లో ఎంపీల సంఖ్య పెరుగుతుందన్నారు. దానికి తగ్గట్టుగానే ఆధునిక వసతులతో కొత్త భవనం నిర్మించామన్నారు. కొత్త పార్లమెంటు భవనం చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారని వివరించారు. వాస్తుశిల్పం, వారసత్వం, కళ, నైపుణ్యం, సంస్కృతి ఉన్నాయని తెలిపారు. లోక్‌సభ లోపలి భాగం జాతీయ పక్షి నెమలి, రాజ్యసభ లోపలి భాగం జాతీయ పుష్ప కమలం నమూనలో ఉంటుంది. పార్లమెంట్ ఆవరణలో జాతీయ వృక్షం మర్రి చెట్టు కూడా ఉంది అని గుర్తుచేశారు. గత 9 ఏళ్లుగా నవ నిర్మాణం, పేదల సంక్షేమం కోసం కృషి చేశామని.. గ్రామాలను కలుపుతూ 4 లక్షల కి.మీ. రోడ్లు వేశామన్నారు.
కొత్త భవనం స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసే సాధనంగా మారుతుందని మోడీ (Modi) వివరించారు. నవ భారత్ కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తోంది. కొత్త ఉత్సాహం, కొత్త దిశ, కొత్త దృష్టి మొదలైందన్నారు. ఆజాదీకా అమృతకాలం.. దేశానికి కొత్త దిశను నిర్దేశించే కాలం అన్నారు మోడీ (Modi). స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ కొత్త యాత్ర ప్రారంభించిందని తెలిపారు. ఆటంకాలను దాటుతూ భారత్ అమృతోత్సవ వేళకు చేరుకుందని పేర్కొన్నారు. అమృతోత్సవ కాలం దేశానికి కొత్త మార్గం సూచిస్తుందని ఉద్ఘాటించారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలను సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మోడీ (Modi). ముక్త భారత్ కోసం కొత్త పంథా కావాలని అభిప్రాయపడ్డారు. కొత్త భవనం భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తుందని మోడీ కీర్తించారు. దీంతో ప్రపంచ యవనికలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోందని చెప్పారు.