Minister Muthusamy has no tolerance for drunkards who drink alcohol early in the morning
తమిళనాడు(Tamilanadu) రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి ముత్తుసామి మద్యం తాగేవారి గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఉదయం మద్యం తాగేవారిని తాగుబోతులు అని హీనంగా మాట్లాడితే సహించేదిలేదన్నారు. పొద్దున్నే తాగేవారి విషయం పక్కనపెడితే, ఏ కష్టం చేయని వారు, సోమరులు కూడా మద్యం తాగుతున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటూ ముత్తుసామి తెలిపారు. ముత్తుసామి మాటలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamulai)మండిపడ్డారు.
రాష్ట్రప్రభుత్వం మద్యం అమ్మకాలపై శ్రద్ధ చూపించే బదులు పరిశుద్ధ కార్మికుల గురించి ఆలోచించాలని అన్నామలై అన్నారు. వారి సంక్షేమపథాకాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు మద్యం సేవించనిదే విధుల్లో మురికి పని ముట్టరని చెప్పడం ఆపీ దానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతాకాలిని, గత ఐదేళ్లలో 56 మంది పారిశుధ్య కార్మికులు విధుల్లో మరణించారన్నారు. పారిశుద్ధ కార్మికులు పురోగతి సాధించే పథకాలపై పనిచేయండి అన్నారు. అయితే మంత్రి ముత్తుసామి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రెండో సారి. గతంలో కూడా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య విధులకు వెళ్లే వారికి మద్యం అమ్మడంపై చర్చ జరగాలన్నారు.