ఉద్యోగం సాధించాక చేసుకుందాం.. ఇప్పుడు వద్దని దీపక్ చెబుతున్నా ఆమె వినడం లేదు. ఒత్తిడి తీవ్రమవడంతో ఎట్టకేలకు దీపక్ పెళ్లికి అంగీకరించాడు. ఆర్య సమాజ్ లోని గుడిలో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
ప్రేమించుకున్నారు.. కలిసి జీవిద్దాం అనుకున్నారు.. గుడిలో పెళ్లికి (Marriage) ఏర్పాట్లు పూర్తయ్యాయి.. అంతలోనే వరుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు కూడా విషయం తాగి ఆత్యహత్యకు యత్నించింది. ఈ సంఘటనలో వరుడు (Groom) మృతి చెందగా.. వధువు (Bride Groom) ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని ఇండోర్ (Indore)లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోర్ లోని కనాడియా (Kanadia) ప్రాంతానికి చెందిన దీపక్ (21), ఇషా (20) ప్రేమించుకున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న తమ ప్రేమను వివాహంగా మలచుకోవాలని ఇషా భావించింది. పెళ్లి చేసుకోవాలని తరచూ దీపక్ పై ఒత్తిడి పెంచుతోంది. ఉద్యోగం సాధించాక చేసుకుందాం.. ఇప్పుడు వద్దని దీపక్ చెబుతున్నా ఆమె వినడం లేదు. ఒత్తిడి తీవ్రమవడంతో ఎట్టకేలకు దీపక్ పెళ్లికి అంగీకరించాడు. ఆర్య సమాజ్ (Arya Samaj)లోని గుడిలో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. గురువారం పెళ్లి జరుగాల్సి ఉండగా.. వరుడు దీపక్ విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని వధువుకు ఫోన్ చేసి చెప్పాడు. ఇషా కూడా విషం సేవించింది. స్నేహితులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి దీపక్ చనిపోయాడు. ఇషా మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ సంఘటనపై పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తన అన్నపై ఇషా తరచూ వేధింపులకు పాల్పడుతుండేదని దీపక్ సోదరుడు జితేంద్ర తెలిపాడు. కొన్ని నెలలుగా పెళ్లి చేసుకోవాలనే ఇషా తన అన్నపై ఒత్తిడి (Pressure) చేస్తోందని చెప్పాడు. రూ.80 వేలు తీసుకుందని ఆరోపించాడు. పెళ్లి చేసుకోకుంటే రూ.10 లక్షలు ఇస్తే విడిపోదామని ఇషా వేధిస్తున్నట్లు జితేంద్ర వివరించాడు. కాగా ఆమె వేధింపులపై దీపక్ గతంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫోన్ చేసినట్లు తెలిసింది.